AP High Court: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు !

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు !

AP High Court: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు(AP High Court) కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్స్ కు సంబంధించిన జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి… రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. మెయిన్స్‌ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం… మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎపీపీఎస్సీను ఆదేశించింది. అంతేకాదు ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

AP High Court – కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు – నారా లోకేష్

ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన సీఎం జగన్‌ కు హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ విమర్శలు గుప్పించారు. 49 వేల ఓఎంఆర్ షీట్లు వైసీపీ గ్యాంగ్ మార్చేసిందని ఆయన ఆరోపించారు. ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చారని అన్నారు. వైసీపీ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని మండిపడ్డారు.

Also Read : YSRCP MLA on CAA: సీఏఏపై వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!