AP High Court: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా
AP High Court: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరపు న్యాయవాది అశ్వనీకుమార్ సూచించారు. అయితే రోస్టర్ ప్రకారం ప్రస్తుతం ఉన్న కోర్టులోనే విచారించాలని పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. ఇవన్నీ నిశితంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.
AP High Court Order..
ఈ కేసులన్నిటిలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు(AP High Court) తోసిపుచ్చడంతో జూన్ 26న పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పిన్నెల్లిపై మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు హత్యాయత్నం కేసులున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేట్ గ్రామంలో ఈవీఎం ధ్వంసం ఘటన ప్రధానంగా ఉంది. బెయిల్ కోసం పలుమార్లు హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్లు వేసినప్పటికీ ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. అయితే ఈనెల 14 అయినా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది.
Also Read : Bosta Satyanarayana: విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్