AP High Court: విశాఖ బీచ్ లో అక్రమ నిర్మాణాలపై హై కోర్టు సీరియస్
విశాఖ బీచ్ లో అక్రమ నిర్మాణాలపై హై కోర్టు సీరియస్
AP High Court : విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రాంతంలోని బీచ్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికు సంబంధించిన నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలు పూర్తిగా తొలగించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చూస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు(AP High Court). వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి సీఆర్‌జెడ్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్ట్‌లో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.
AP High Court Serious
దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరపగా… బుధవారం మరోసారి హైకోర్టులో విచారణకు విచారణకు వచ్చింది. కేవలం పైకి కనిపించే గోడను తొలగించి ఇసుక కింద ఉన్న గోడను తొలగించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కోర్టు. నివేదికలో ఈ విషయాన్ని చెప్పకపోవడంపై మండిపడింది. భూమి లోపల ఉన్న గోడను కూడా తొలగించాలని అధికారులకు న్యాయస్థానం ఆదేశించింది. కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి… అలా చేస్తేనే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని పేర్కొన్నారు.
అంతేకాదు అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అయ్యే ఖర్చును మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ నుంచి వసూలు చేయాలని జీవీఎంసీకి ఆదేశించింది. కాంక్రీట్ నిర్మాణాలతో ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కమిటీ వేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రకృతికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి సొమ్మును కంపెనీ నుంచి వసూలు చేయాలని స్పష్టీకరించింది. ప్రైవేటు కంపెనీపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సంబంధిదిత అధికారికి స్పష్టం చేసింది. భీమునిపట్నం సమీపంలోని సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు (రెస్టోబార్ల) విషయంలో కూడా సర్వే చేయాలని అధికారుల బృందానికి న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే వాయిదా నాటికి సమాచారం తమ ముందు ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read : Vemula Veeresham: సైబర్ నేరగాళ్ల వలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం