New Liquor Policy: మందు బాబులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్

మందు బాబులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్

New Liquor Policy : మందుబాబులకు టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న మద్యం పాలసీ గడవు మరికొన్ని రోజుల్లో ముగియనుండటంతో… మందుబాబులకు అనుగుణంగా కొత్త మద్యం పాలసీను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

రాష్ట్రంలో మద్యం పాలసీ గడువు మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త మద్యం విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొత్త మద్యం విధానాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త మద్యం విధానాన్ని అమలు చేయనుంది. మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు… ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే విధంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనితో అల్కాహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం విక్రయాలతో నష్టం తగ్గించ వచ్చునని భావిస్తుంది. అంటే.. మద్యం కారణంగా పేదల ఇళ్లు, ఒళ్లు గుల్లా కాకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్రమంలో బార్లలో కూడా గీత కార్మిక వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

New Liquor Policy – ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్లు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. 7 క్లినికల్ సబ్జెక్టుల్లో 15 శాతం, నాన్ క్లినికల్ సబ్జెక్టుల్లో 30 శాతం రిజర్వేషన్ వారికి కల్పించాలని నిర్ణయించారు. అయితే స్పెషలిస్టుల అవసరాలతోపాటు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల ఆకాంక్షల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రిజర్వేషన్లు కల్పించాలంటూ వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.

Also Read : WhatsApp: భారత్‌ లో 98 లక్షల ఖాతాలను నిలిపి వేసిన వాట్సాప్ సంస్థ

Leave A Reply

Your Email Id will not be published!