Gautham Reddy : ఇది ఊహించని షాక్ ఏపీకి. ప్రధానంగా డైనమిక్ లీడర్ గా పేరొందిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి. స్వంత తమ్ముడి కంటే ఎక్కువగా అభిమానించే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Gautham Reddy )లేని లోటు పూడ్చ లేనిది.
ఏపీ రాష్ట్రానికి తీరని లోటుగా అభివర్ణించక తప్పదు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా, స్నేహ శీలిగా పేరొందారు గౌతమ్ రెడ్డి.
మాంచెస్టర్ లో చదువుకున్నా తన రాష్ట్రం బాగుండాలని, అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని పరితపించాడు.
కానీ అనుకోని రీతిలో గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన కుటుండానికి పెద్ద దెబ్బ.
కోలుకోలేని షాక్. కేవలం 50 ఏళ్ల వయస్సు లోనే కాలం చేయడం బాధాకరం.
ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు. అంతే కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త. తండ్రి అడుగుజాడల్లో నడిచాడు. తండ్రికి గొప్ప పేరుంది.
ఆయన 1985లో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 1989, 2004, 2009, 2012 , 2014 లో ఒంగోలు, నర్సారావుపేట, నెల్లూరు లోక్ సభ నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు.
ఆయనకు ముగ్గురు కొడుకులు. వీరిలో గౌతమ్ రెడ్డి ఒక్కరే పాలిటిక్స్ కు రాగా మిగతా వాళ్లంతా వేరే రంగాల్లో కొలువు తీరారు.
గౌతమ్ రెడ్డి(Gautham Reddy )చిన్నాన్న చంద్రశేఖర్ రెడ్డి 2019లో ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2004, 2009, 2012 లో విజయం సాధించారు. ఇక మేకపాటి గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2న నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో పుట్టారు. 1994-97లో ఇంగ్లండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్ నుంచి ఎంఎస్సీ పట్టా పొందారు.
ఆయనకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉంది. 2014లో పాలిటిక్స్ లోకి ఎంటరయ్యారు. 2014, 2019లో ఆత్మకూర్ నుంచి
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రస్తుతం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రస్థానం ముగిసింది. విద్యాధికుడిగా గౌతమ్ రెడ్డికి మంచి విజన్ ఉంది. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందంజలో నిలపాలనే తపన ఉండింది.
చని పోయే కంటే ముందు కూడా ఆయన దుబాయిలో వారం రోజుల పాటు ఉన్నారు. కానీ అంతలోనే విధి ఆయనను విడదీసింది ఈ లోకం నుంచి.
Also Read : ‘కళాతపస్వీ’ కలకాలం వర్దిల్లు