Buggana Rajendranath Reddy : కేంద్ర మంత్రితో బుగ్గన భేటీ
విద్యుత్, పునరుత్పాదకతపై ఫోకస్
Buggana Rajendranath Reddy : ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy) ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై ప్రస్తావిస్తున్నారు. ఆర్థిక రంగమే కాదు ఏపీ రాష్ట్రానికి సంబంధించి పూర్తి అవగాహన కలిగిన మంత్రులలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముందుంటారు. ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానం చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.
బుధవారం ఢిల్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర విద్యుత్ , పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కే సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా గంటకు పైగా వివిధ అంశాల గురించి చర్చించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కీలకమైన రాష్ట్రంగా మారిందని వివరించారు. అపారమైన వనరులు కలిగి ఉన్నది. దీనిపై ఎక్కువగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారని ఈ సందర్బంగా వివరించారు మంత్రికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
విద్యుత్ వినియోగం, పునరుత్పాదక, ఇంధన రంగాలకు సంబంధించి ఏర్పాటు చేసేందుకు కావాల్సిన వసతి సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర బిందువుగా రాష్ట్రం ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఈ ప్రధాన రంగాలకు సంబంధించి ఏపీ రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కోరారు రాష్ట్ర మంత్రి. ఇప్పటికే వైజాగ్ లో నిర్వహించిన సమ్మిట్ లో భారీ ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.
Also Read : Farooq Abdullah : డీకేఎస్ తో ఫరూక్ అబ్దుల్లా భేటీ