Bhumireddy Ramgopal Reddy : మూడో ఎమ్మెల్సీ కూడా టీటీడీదే
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో హవా
Bhumireddy Ramgopal Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ పార్టీ జయకేతనం ఎగుర వేస్తే ముఖ్యంగా యువత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. తాజాగా పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ స్థానంలో సైతం టీడీపీ అభ్యర్థి గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు.
మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే రెండింటిని కైవసం చేసుకుంది. చివరి మూడో స్థానం కూడా తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లింది. ఇది ఊహించని షాక్ జగన్ మోహన్ రెడ్డికి. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది కడప – అనంతపురం – కర్నూలు జిల్లాలతో కూడిన పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నిక.
వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డిపై 7,543 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమి రెడ్డి రామ భూపాల్ రెడ్డి(Bhumireddy Ramgopal Reddy) గెలుపొందారు. ఆయన విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి. ఇదిలా ఉండగా ఈ కౌంటింగ్ లో భూమి రెడ్డి రామ భూపాల్ రెడ్డికి 1,09,781 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డికి 1,02,238 ఓట్లు వచ్చాయి.
అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాత గుర్తింపు పత్రాన్ని అందజేస్తామని రిటర్నింగ్ ఆఫీసర్ వెల్లడించారు. చివరి వరకు నువ్వా నేనా అన్న రీతిలో కౌంటింగ్ సాగింది. తొలి ప్రాధాన్యత ఓటులో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండగా రెండో రౌండ్ ప్రాధాన్యత ఓటులో టీడీపీ అభ్యర్థికి ఓట్లు వచ్చాయి. మొత్తం 49 మంది పోటీ పడ్డారు.
Also Read : స్పీకర్ సీరియస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్