AP Police: పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల

పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల

AP Police : ఏపీలో 6,100 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత వీటిని విడుదల చేశారు. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా (DGP Harish Kumar Gupta), పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ ఆర్‌.కె.మీనా పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గండి నానాజి 168 మార్కులతో ప్రథమ స్థానంలో, జి.రమ్య మాధురి (159) రెండో స్థానంలో, మెరుగు అచ్యుతారావు(144.5) మూడో స్థానంలో నిలిచారు.

AP Police – ఏపీ పోలీసుల మెరుపు ఆపరేషన్ ! అంతర్జాతీయ సైబర్ మాఫియా అరెస్ట్ !

దేశ సరిహద్దులు దాటి సైబర్ నేరగాళ్లను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కాంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌ల‌ని ఆపరేట్ చేస్తున్న నేరగాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అనంతపురం ఎస్పీ జగదీష్ ఇవాళ(శుక్రవారం) మీడియాకు వివరాలు వెల్లడించారు. రాయదుర్గంకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అకౌంట్ నుంచి రూ.1.74కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టామని తెలిపారు అనంతపురం ఎస్పీ జగదీష్.

ఢిల్లీ కేంద్రంగా ఫేక్ అకౌంట్ల ద్వారా పలు అకౌంట్లలోకి సైబర్ క్రిమినల్స్ డబ్బు మార్పిడి చేశారని అనంతపురం ఎస్పీ జగదీష్ అన్నారు. ఈ కేస్‌‌ను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టామని చెప్పుకొచ్చారు. దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఐదుమంది సైబర్ నేరగాళ్లని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి 8 సెల్‌ఫోన్‌లు, కారు, 20 ఏటీఎం కార్డ్స్, 15 సిమ్‌కార్డ్స్, 5 బ్యాంక్ పాస్ బుక్కులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా క్రియేట్ చేసిన 13 ఫేక్ అకౌంట్లలోకి డబ్బులు వెళ్లినట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. క్రిప్టో కరెన్సీ ద్వారా పైసలను దేశం దాటించేందుకు సైబర్ క్రిమినల్స్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కాంబోడియా దేశం నుంచి నేరగాళ్లు మొత్తం నెట్‌వర్క్‌ని ఆపరేట్ చేస్తున్నారని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు.

Also Read : Anantapur Central University: అనంతపురం సెంట్రల్‌ వర్సిటీలో 150 మంది విద్యార్ధులకు అస్వస్థత

Leave A Reply

Your Email Id will not be published!