AP DSC Jobs : టీచర్ పోస్టులకు ఏపీ సర్కార్ ఓకే
502 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
AP DSC Jobs : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆయన విద్య, వైద్యం, ఉపాధి, మహిళల భద్రత, వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ , టెక్నాలజీ రంగాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా కొలువులను భర్తీ చేస్తూ వస్తున్నారు. వీటికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా ఎత్తున జాబ్స్ ను రిక్రూట్ చేస్తూ వస్తున్నారు.
అంతే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి.
తాజాగా ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం ఆదేశాల రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ 502 టీచర్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది.
దీనిని డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ లిమిటెడ్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల ప్రజా పరిషత్ పాఠశాలలో 199 పోస్టులు, మోడల్ స్కూళ్లలలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అంతే కాకుండా పురపాలిక శాఖ పరిధిలోని మున్సిపల్ స్కూళ్లలో 15 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది పాఠశాల విద్యా శాఖ. మరో వైపు విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులు(AP DSC Jobs) 81ని భర్తీ చేయనున్నారు.
డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 25 నుంచి సెప్టెంబర్ 18 దాకా దరఖాస్తులు స్వీకరిస్తారు.
అక్టోబర్ 23న పరీక్ష చేపడతామని, నవంబర్ 4న రిజల్ట్స్ ప్రకటిస్తామని తెలిపింది ప్రభుత్వం.
Also Read : ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకమాండ్ షాక్