AP Schools Holidays: ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగింపు !

ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగింపు !

AP Schools Holidays: ఏపీలో ప్రభుత్వ పాఠశాలలకు మరో మూడు రోజుల పాటు సంక్రాంతి సెలవులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ పాఠశాల విద్యా శాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు.

AP Schools Holidays Updates

దీనితో జనవరి 22 (సోమవారం) న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ గతంలో పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సెలవులు పొడిగించమని కోరడంతో… ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : YS Sharmila: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ను కలిసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల !

Leave A Reply

Your Email Id will not be published!