AP Secretariat: ఏపీ సచివాలయంలో ఐదు రోజులే పనిదినాలు !

ఏపీ సచివాలయంలో ఐదు రోజులే పనిదినాలు !

AP Secretariat: రాజధాని ప్రాంత పరిధిలో రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఫైల్‌కు ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని, ఇవాళ్టి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాల్లో పేర్కొన్నారు.

AP Secretariat…

2014లో నవ్యాంధ్ర ఏర్పాటుతో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను విడిచి పెట్టి అమరావతి వేదికగా రాష్ట్ర సచివాలయం ఏర్పాటు చేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన ప్రారంభించారు. అయితే అప్పటికే హైదరాబాద్ లో స్థిరపడి ఉన్న సచివాలయం ఉద్యోగులకు… విధినిర్వహణలో వెలుసుబాటు కల్పించే విధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… సచివాలయం ఉద్యోగులకు వారంలో పనిదినాలను ఐదు రోజులకు కుదించారు. అప్పటి నుండి రాష్ట్ర సచివాలయంకు శని, ఆదివారాలు సెలవులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పనిదినాల ఉత్తర్వులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Minister Seethakka: చెంచు మహిళపై దాడి ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం!

Leave A Reply

Your Email Id will not be published!