AP CM YS Jagan : విద్యార్థులు ప్ర‌పంచ పౌరులుగా ఎద‌గాలి

చ‌ర్య‌లు చేప‌ట్టిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి

AP CM YS Jagan : ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి విద్యా రంగంపై ఫోక‌స్ పెట్టారు. టెక్నాల‌జీ ప‌రంగా చోటు చేసుకున్న మార్పుల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన నాడు నేడు దేశానికే ఆద‌ర్శంగా మారింది. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఏఐ, ఎల్ఎల్ఎం, ఛాట్ జీపీటీ, వెబ్ 3.0 త‌ర‌హా భ‌విష్య‌త్తు సాంకేతిక ప‌రిజ్ఞానంలో విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు సీఎం(CM YS Jagan) ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నైపుణ్యాల‌ను పెంచేందుకు ప్లాన్ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఉన్న‌తాధికారులు, గ్లోబ‌ల్ కంపెనీల ప్ర‌తినిధుల‌తో వ‌ర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు సీఎం. ఈ వ‌ర్కింగ్ గ్రూప్ల ఓ మైక్రో సాఫ్ట్ , అమెజాన్ , గూగుల్ , ఇంటెల్ , నాస్కాం ప్ర‌తినిధులు ఉన్నారు. జీవో జారీ చేసింది. ఇందులో పాఠ్య ప్ర‌ణాళిక‌, ఉండాల్సిన మాన‌వ వ‌న‌రులు, స‌దుపాయాల‌పై వ‌చ్చే నెల జులై 15న క‌ల్లా వ‌ర్కింగ్ గ్రూప్ నివేదిక ఇవ్వ‌నుంది.

విద్యా రంగంలో కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చారు సీఎం. 2019-20 నుంచి ప్ర‌భుత్వ బ‌డుల్లో ఆంగ్ల మాధ్య‌మాన్ని ప్ర‌వేశ పెట్టారు. దీని వ‌ల్ల 41 ల‌క్ష‌ల మంది విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. ఇంగ్లీష్ లో భాషా ప‌రిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసింది. 2021-22 లో 6వ త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఆక్స్ ఫ‌ర్డ్ డిక్ష‌న‌రీని కూడా అంద‌జేసింది. 2022-23 లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను సీబీఎస్ఈ అఫిలియేష‌న్ సంబంధం నెల‌కొల్పింది.

Also Read : Delhi Cops To Wrestlers : రెజ్ల‌ర్లు ఆధారాలుంటే ఇవ్వండి

 

Leave A Reply

Your Email Id will not be published!