AP Teacher: స్కూల్‌ వాట్సప్‌ గ్రూప్‌ చూడట్లేదని టీచర్‌ సస్పెన్షన్‌ !

స్కూల్‌ వాట్సప్‌ గ్రూప్‌ చూడట్లేదని టీచర్‌ సస్పెన్షన్‌ !

AP Teacher: స్కూల్ వాట్సప్ గ్రూప్ చూడట్లేదని విద్యాశాఖ అధికారులు టీచర్ సస్పెన్షన్ చేసిన ఘటన ఏపీలో వివాదానికి కారణమౌతుంది. విజయవాడలోని మొగల్రాజపురం బీఎస్‌ఆర్‌కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.రమేష్‌.. స్కూల్‌వాట్సప్‌ గ్రూప్‌లోని మెసేజ్‌లు చూడడం లేదని విద్యాశాఖ అధికారులు సస్పెండ్‌ చేసారు. దీనితో విద్యాశాఖ అధికారుల తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆ సస్పెన్షన్‌ ను రద్దు చేయాలంటూ… జిల్లా విద్యాశాఖ అధికారులకు యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. తనకు కంటి సంబంధిత సమస్య ఉండడంతో స్మార్ట్‌ఫోన్‌ వాడొద్దని వైద్యులు సూచించారని రమేష్‌ వివరణ ఇచ్చినా… వ్యక్తిగత విషయాన్ని సాకుగా చూపిస్తూ సస్పెండ్‌ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

AP Teachers..

దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు మాట్లాడుతూ… వాట్సప్‌ గ్రూపు నుంచి రమేష్‌ అకస్మాత్తుగా వెళ్లిపోవడం, విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం, కంటి సమస్య ఉన్నట్లు వైద్యులు సూచించిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని కోరినా స్పందించకపోవడం వల్లే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Also Read : Election Commission: పోస్టల్ బ్యాలట్లు తిరస్కరణపై ఈసీ కీలక ఆదేశాలు !

Leave A Reply

Your Email Id will not be published!