Vasireddy Padma : ఆర్జీవీ నిర్వాకం మహిళా కమిషన్ ఆగ్రహం
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ట్వీట్
Vasireddy Padma : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం (ఎన్డీయే) ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ద్రౌపది సరే కౌరవులు ఎక్కడ అంటూ వ్యాఖ్యానించడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యత కలిగిన దర్శకుడి అయి ఉండి ఒక ఆదివాసీ తెగకు చెందిన మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు.
బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ తరపున రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇస్తున్నట్లు వెలలడించారు.
ఆర్జీవీ వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. మహిళలకు సంబంధించిన భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు.
ఢిల్లీలో జరిగిన జాతీయ మహిళా కమిషన్ సెమినార్ కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని ఏపీ మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిందన్నారు.
ఈ మేరకు ఏప సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
Also Read : పంతుళ్ల ప్రతాపం తలవంచిన ప్రభుత్వం