Aparesh Kumar Singh: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌కుమార్‌ సింగ్‌

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌కుమార్‌ సింగ్‌

Aparesh Kumar Singh : దేశంలో పలువురు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించడంతో కేంద్ర న్యాయశాఖ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ అపరేష్‌కుమార్‌ సింగ్‌ (Aparesh Kumar Singh) బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు సీజేగా పనిచేస్తున్నారు.

Aparesh Kumar Singh As A Telangana High Court Judge

ప్రస్తుతం ఝార్ఖండ్‌ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావును త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. మద్రాస్‌, రాజస్థాన్‌ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కూడా బదిలీ చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ బట్టు దేవానంద్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. గతంలోనూ ఆయన ఏపీ హైకోర్టు జడ్జిగా పనిచేశారు.

ఇదిలా ఉండగా, అపరేష్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) (Aparesh Kumar Singh) 1965, జూలై 7న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అనంతరం 1990 నుంచి 2000 వరకూ ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఏప్రిల్ నుంచి జార్ఖండ్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా అపరేష్ కుమార్ నియమితులయ్యారు. ఇక 2022 నుంచి 2023 వరకూ జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023, ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ పదోన్నతి సాధించారు. కాగా, తాజాగా తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.

జల వివాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి కేంద్రం ఏర్పాట్లు

జల వివాదంపై చర్చకు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16న దిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ నేతృత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కావాలని కేంద్రం కోరింది. ఈ మేరకు వీరిద్దరిని ఆహ్వానిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ సర్క్యులర్‌ విడుదల చేసింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు ఇద్దరు సీఎంలకు వీలవుతుందో లేదో తెలపాలని పేర్కొంది.

మరోవైపు కృష్ణా, గోదావరి వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై రాష్ట్రంలోని ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ ఇవ్వాలని, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని సీఎం కోరనున్నారు.

Also Read : CM Omar Abdullah: గోడ దూకిన జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా

Leave A Reply

Your Email Id will not be published!