Gidugu Rudra Raju : వర్మ ‘వ్యూహం’ కాంగ్రెస్ ఆగ్రహం
సోనియాను కించపరిస్తే ఊరుకోం
Gidugu Rudra Raju : వివాదాలకు కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది తీసినా లేదా ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. భారత దేశంలో మోస్ట్ పాపులర్ , కాంట్రోవర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. వర్మ ఫ్యాక్టరీలో ఎందరో నటీనటులు బయటకు వచ్చారు. అంతే కాదు టెక్నీషియన్స్ కూడా దుమ్ము రేపారు. ప్రధానంగా బాలీవుడ్ లో వర్మ శిష్యులే రాజ్యం ఏలడం విశేషం. కానీ ఈ మధ్యన కొన్ని చెత్త సినిమాలు తీసి తన పరువు తానే పోగొట్టుకుంటున్నాడనే ఆరోపణలు లేక పోలేదు.
ఇది పక్కన పెడితే తాజాగా వ్యూహం పేరుతో సినిమా తీశాడు. ఇందుకు సంబంధించి టీజర్ విడుదల చేశాడు ఆర్జీవీ. ఇది పూర్తిగా వివాదాస్పదంగా మారింది. కారణం జగన్ కు సపోర్ట్ గా డైలాగులు ఉండడం ఆపై కాంగ్రెస్ పార్టీ కావాలని కేసులు పెట్టించింది అన్నట్టుగా ఉంది. దీంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గిడుగు రుద్ర రాజు(Gidugu Rudra Raju) భగ్గుమన్నారు ఆర్జీవీపై. ఇదిలా ఉండగా వ్యూహం చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నట్లు ప్రకటించారు వర్మ. అయితే తమకు ఎందుకు ఈ ఖర్మ అంటున్నారు రుద్ర రాజు.
ఉన్నవి లేనట్టుగా చూపించి ఏదో సెన్సేషన్ అవుదామని అనుకుంటే తాట తీస్తామంటుని హెచ్చరించారు. ప్రత్యేకించి గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పోతే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని మండిపడ్డారు. ప్రస్తుతం విడుదలైన టీజర్ మాత్రం వివాదాలు రాజేస్తోంది. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ కు కావాల్సింది అదే. సినిమాలోని 24 ఫ్రేమ్ ల గురించి అనుభవం, అవగాహన కలిగి ఉన్న ఏకైక సినీ దర్శకుడు ఆర్జీవీ. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : Wasim Jaffer : బీసీసీఐ జట్ల ఎంపికపై జాఫర్ ఫైర్
