Apple Air Pods : భారత్ లో యాపిల్ ఎయిర్‌పాడ్‌ల తయారీ
వెల్లడించిన ఐటీ మంత్రిత్వ శాఖ
Apple Air Pods : భారత ఐటీ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రపంచంలోనే టాప్ మొబైల్ తయారీ సంస్థగా పేరొందిన అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ ఎయిర్ పాడ్ లను భారత్ లో తయారు చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
ఎయిర్ పాడ్ లు, బీట్ హెడ్ ఫోన్ ల ఉత్పత్తిని భారత్ కు తరలించాలని యాపిల్ తన సరఫరాదారులను కోరినట్లు సమాచారం. టెక్నాలజీ దిగ్గజం ఇందుకు ఓకే చేసిందని ఐటీ శాఖ పేర్కొంది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
జపనీస్ వెబ్ సైట్ నిక్కీకుపెర్టినో ఆధారిత టెక్నాలజీ దిగ్గజం ఎయిర్ పాడ్ లు, బీట్ హెడ్ ఫోన్ ల తయారీని భారత దేశానికి తరలించమని కోరినట్లు నివేదించిన కొన్ని రోజుల తర్వాత ఇది జరిగింది. ఇంతకు ముందు యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 14 తయారీని(Apple Air Pods) ప్రారంభించాలని డిసైడ్ అయ్యింది.
ఈ మేరకు తన ప్లాన్ ను కూడా ప్రకటించింది. ఇది సెప్టెంబర్ 7న ఫార్ అవుట్ ఈవెంట్ సందర్భంగా ప్రారంభించబడింది. కంపెనీ ఇప్పటికే ఐఫోన్ 13ని భారత దేశంలో తయారు చేస్తోంది. ఐప్యాడ్ టాబ్లెట్ లను అసెంబుల్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తోంది.
ఇదిలా ఉండగా బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం గత ఐదు నెలల్లో భారత దేశం నుండి ఐఫోన్ ఎగుమతులు ఇప్పటికే $1 బిలియన్లను అధిగమించాయి. రాబోయే 12 నెలల్లో $2.5 బిలియన్లకు చేరుకోబోతున్నాయి.
కాగా అమెరికన్ బ్రాండ్ లకు సరఫరా చేసే కాంట్రాక్ట్ తయారీదారులకు భారత్ , మెక్సికో, వియత్నాం వంటి దేశాలు ముఖ్యమైనవి.
Also Read : వాట్సాప్ కు దూరంగా ఉండండి – డ్యూరోవ్