Arabic Kuthu Song : దుమ్ము రేపుతున్న ‘అర‌బిక్ కుతు’

నెట్టింట్లో వైర‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ సెన్సేష‌న్

Arabic Kuthu Song  : త‌ల‌ప‌తి విజ‌య్ , పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బీస్ట్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ హీరోగా ఇప్ప‌టికే పేరు తెచ్చుకున్నారు విజ‌య్.

డిఫ‌రెమంట్ మేన‌రిజంతో జ‌నాల్ని ఆక‌ట్టు కోవ‌డంలో త‌న‌కు తానే సాటి ఈ స్టార్ హీరో. ఇక బుట్ట బొమ్మ గురించి చెప్పాల్సింది ఏముంది.

ఇప్ప‌టికే విజ‌య్ మాస్ట‌ర్ కు మ్యూ జిక్ అందించిన అనిరుధ్ ర‌విచంద్ర‌న్ బీస్ట్ మూవీకి కూడా అందించాడు.

న‌టుడు శివ కార్తికేయ‌న్ రాసిన అర‌బిక్ కుతు సాంగ్ (Arabic Kuthu Song )ను అనిరుధ్ తో పాటు జొనిటా గాంధీ పాడారు.

ఈనెల 14న ప్రేమికుల రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్. కొన్ని గంట‌ల్లోనే వ‌ర‌ల్డ్ ను పాట షేక్ చేసింది.

మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ తో దూసుకు పోతోంది అర‌బిక్ కుతు. ఎక్క‌డ చూసినా ఇదే సాంగ్ .

ఓ వైపు మ‌హేష్ బాబు న‌టించిన క‌ళావ‌తి సాంగ్ ఇంకో వైపు విజ‌య్ సాంగ్ పోటా పోటీగా ప‌రుగులు తీస్తున్నాయి.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది అరబిక్ కుతు. విజ‌య్ , పూజా హెగ్డే వేసిన స్టెప్పుల‌కు యూత్ బాగా క‌నెక్టు అయ్యింది.

సాధార జ‌నం నుంచి ప్ర‌ముఖుల దాకా ఈ పాట‌కు కాలు క‌దుపుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

షూటింగ్ కోసం వెళ్లిన స‌మంత సైతం ఈ పాట‌కు ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్ చేయ‌డం ఆ వీడియో నెట్టింట్లో వైర‌ల్ కావ‌డం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ పాట కేవ‌లం 48 గంట‌ల్లో గ్లోబ‌ల్ టాప్ సాంగ్స్ జాబితాలోకి చేరి పోవ‌డం విశేషం.

బీస్ట్ మూవీని నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఏప్రిల్ 14న ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ భావిస్తోంది.

Also Read : ప్రీ రిలీజ్ కోసం భీమ్లా నాయ‌క్ సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!