BC Nagesh : రూల్స్ పాటించని అరబిక్ స్కూల్స్
కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్
BC Nagesh : కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్(BC Nagesh) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు సంఘటనలతో అట్టుడుకుతోంది కన్నడ రాష్ట్రం. తాజాగా రాష్ట్రంలోని ప్రధానంగా అరబిక్ పాఠశాలలు అస్సలు ప్రభుత్వం అమలు చేస్తున్న రూల్స్ ను పాటించడం లేదంటూ ఆరోపించారు.
ప్రధానంగా ఈ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రామాణికమైన విద్య అందడం లేదన్నారు. దీంతో ఇతర స్కూళ్లల్లో చదువుతున్న పిల్లలతో పోటీ పడలేక పోతున్నారని తమ విద్యా శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు బీసీ నగేష్.
ఇతర ఎయిడెడ్ బడులతో పోలిస్తే ఈ అరబిక్ బడుల్లో(Arab Schools) చేరిన విద్యార్థులు ఒకే విధమైన విద్యను అందుకోలేక పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు విద్యా శాఖ మంత్రి.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అరబిక్ మీడియం పాఠశాలలు వెంటనే నివేదికలు సమర్పించాలని కర్టాటక సర్కార్ విద్యా శాను ఆదేశించింది. రాష్ట్రం నిర్దేశించిన ఇతర సబ్జెక్టులను బోధించనందుకు ఆయా పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు మంత్రి బీసీ నగేష్(BC Nagesh).
ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని ప్రయత్నం చేస్తోంది. కానీ ప్రధానంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పాఠశాలలు నిర్దేశించిన రూల్స్ ను పాటించడం లేదన్న ఆరోపణలు తమకు రోజూ అందుతూనే ఉన్నాయని చెప్పారు.
ఇలాంటి సమయంలో తాము సర్వే చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు బీసీ నగేష్.
Also Read : రాహుల్ గాంధీకి స్వర భాస్కర్ కితాబు