Messi Team Grand Welcome : మెస్సీ సేన ఉప్పొంగిన అర్జెంటీనా

అభిమాన‌సంద్రం ఘ‌న స్వాగ‌తం

Messi Team Grand Welcome : అర్జెంటీనా ఎక్క‌డ చూసినా అభిమానుల‌తో నిండి పోయింది. మెస్సీ సార‌థ్యంలోని త‌మ జ‌ట్టు ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిల‌వ‌డం, ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా తిరిగి రావ‌డంతో(Messi Team Grand Welcome) ఆ దేశ ప్ర‌భుత్వం న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఏర్పాట్లు చేసింది. మెస్సీ సేన‌కు ల‌క్ష‌లాది అభిమానులు జేజేలు ప‌లికారు.

ఇసుక వేస్తే రాల‌నంత జ‌నంతో నిండి పోయింది. మెస్సీ అంటూ ఫ్యాన్స్ హోరెత్తించారు. అన్ని దారులు మూసుకు పోయాయి. అర్జెంటీనాకు డీగో మార‌డోనా త‌ర్వాత లియోనెల్ మెస్సీ సార‌థ్యంలో ప్ర‌పంచ క‌ప్ సాధ్య‌మైంది. ఫైన‌ల్ లో ఫ్రాన్స్ ను 4-2 తేడాతో ఓడించి జ‌గజ్జేత‌గా నిలిచింది అర్జెంటీనా. దీంతో త‌మ దేశ‌పు జ‌ట్టు కోసం మంగ‌ళ‌వారం దేశ వ్యాప్తంగా ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది.

మెస్సీ వ‌ర‌ల్డ్ క‌ప్ ను ముద్దాడి దిగ్గ‌జాల స‌ర‌స‌న నిలిచాడు. త‌న 20 ఏళ్ల కెరీర్ లో 37 క్ల‌బ్ ట్రోఫీలు, ఏడు బాల‌న డీఆఓర్ అవార్డులు, ఆరు యూరోపియ‌న్ గోల్డెన్ బూట్స్ పుర‌స్కారాలు అందుకున్నాడు. కోపా అమెరికా క‌ప్ కూడా స్వంతం చేసుకున్నాడు. అంతే కాదు ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ సాధించాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ ను 16 ఏళ్ల త‌ర్వాత సాధించాడు.

ఇదిలా ఉండ‌గా అర్జెంటీనా ఘ‌న విజ‌యం త‌ర్వాత మెస్సీ పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మారు మ్రోగింది. మెస్సీ కోసం యావ‌త్ ప్ర‌పంచం వెదికింది. ఇదే విష‌యాన్ని గూగుల్ సంస్థ సిఇఓ సుంద‌ర్ పిచాయ్ మంగ‌ళ‌వారం చెప్పాడు. గూగుల్ మెస్సీ సెర్చింగ్ తో హోరెత్తింద‌ని వెల్ల‌డించాడు. త‌మ సంస్థ సెర్చింగ్ హిస్ట‌రీలో ఇదే అత్య‌ధిక ట్రాఫిక్ గా న‌మోదైంద‌ని తెలిపాడు సుంద‌ర్ పిచాయ్.

Also Read : మేం మ‌ళ్లీ వ‌స్తాం..సాధిస్తాం – ఎంబాపే

Leave A Reply

Your Email Id will not be published!