Amarnath Yatra: ‘అమర్‌నాథ్‌’ యాత్ర బస్సుకు బ్రేకులు ఫెయిల్‌ ! సైన్యం చాకచక్యంతో తప్పిన ముప్పు !

‘అమర్‌నాథ్‌’ యాత్ర బస్సుకు బ్రేకులు ఫెయిల్‌ ! సైన్యం చాకచక్యంతో తప్పిన ముప్పు !

Amarnath Yatra: జమ్మూకశ్మీర్‌ లో అమర్‌నాథ్‌ యాత్రికులకు భయానక అనుభవం ఎదురైంది. తాము ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో… ఆందోళనకు గురైన వారు వాహనం కదులుతుండగానే కిందికి దూకేశారు. ఈ క్రమంలోనే 10 మందికి గాయాలయ్యాయి. భద్రత బలగాలు సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. సైనికులు చాలా చాకచక్యంగా వ్యవహరించి బస్సును ఆపారు. రామ్‌బన్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Amarnath Yatra..

పోలీసుల వివరాల ప్రకారం… పంజాబ్‌(Punjab)లోని హోషియార్‌పుర్‌కు చెందిన దాదాపు 40 మంది యాత్రికులు అమర్‌నాథ్‌ దర్శనం చేసుకుని బస్సులో తిరుగుప్రయాణమయ్యారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై బనిహాల్‌ సమీపానికి చేరుకోగానే బస్సు బ్రేకులు ఫెయిలైనట్లు డ్రైవర్‌ తెలిపాడు. దీంతో ఆందోళనకు గురైన కొంతమంది ప్రాణభయంతో… బస్సు కదులుతుండగానే కిందికి దూకేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి సహా 10 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. పలువురు కిందికి దూకడాన్ని గమనించిన సైనిక సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి… బస్సు టైర్ల కింద రాళ్లు పెడుతూ చివరకు దాన్ని ఆపగలిగారు. వెంటనే అంబులెన్స్‌ను రప్పించి క్షతగాత్రులకు వైద్యసాయం అందించినట్లు అధికారులు తెలిపారు.

Also Read : Hathras Tragedy: ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట ! 116 మంది మృతి!

Leave A Reply

Your Email Id will not be published!