Statue Of Equality : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టూర్ హైదరాబాద్ కు రానున్నారు. ఇవాళ ఆయన మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగా ఇక్రిశాట్ కు వెళతారు.
అక్కడ జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు నేరుగా సమతా కేంద్రంకు(Statue Of Equality) చేరుకుంటారు. శ్రీ రామానుజుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
రాత్రి తిరిగి వెళతారు. అయితే మొదట్లో సీఎం ఆహ్వానం పలుకుతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు తలసాని హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ప్రధాని వచ్చే సమయంలో సీఎం, గవర్నర్ తప్పనిసరిగా ఉండాలి.
ఇది ప్రోటోకాల్ నిబంధన. వీరితో పాటు సీఎస్, డీజీపీ , నగర మేయర్ కూడా హాజరు కావాల్సిందే. కాగా ఇవాళ హాజరయ్యే మోదీకి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరవుతారని సమాచారం.
ఎయిర్ పోర్టు నుంచి ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అయితే సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది అనుమానంగా ఉంది.
ఇక శ్రీరామనగరం సమతా కేంద్రంలో మాత్రం సీఎం మహోత్సవ సమతామూర్తి (Statue Of Equality)ప్రారంభోత్సవ కార్యక్రమంలో తప్పక హాజరుకానున్నారు.
ఇవాళ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరు కానున్నారు సీఎం. ఇక పీఎం సాయంత్రం నేరుగా ఆశ్రమానికి విచ్చేసి కొంత సేపు గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారు.
యాగశాలలో పూర్ణాహుతి, విశ్వక్సేన ఇష్టి హోమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటల సమయంలో మోదీ ప్రసంగించే చాన్స్ ఉంది.
Also Read : సమతా కేంద్రం తెలంగాణకు మణిహారం