Ashok Gehlot : అరెస్ట్ ఎమర్జెన్సీ కంటే దారుణం – సీఎం
పవన్ ఖేరా అరెస్ట్ పై అశోక్ గెహ్లాట్ కామెంట్స్
Ashok Gehlot Pawan Khera : పవన్ ఖేరా అరెస్ట్ పై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నిప్పులు చెరిగారు. ఈ దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. గురువారం సీఎం మీడియాతో మాట్లాడారు. తన పార్టీకి చెందిన సహచర నాయకుడు పవన్ ఖేరాను(Ashok Gehlot Pawan Khera) అక్రమంగా అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అలా చేయాలని అనుకుంటే రాజస్థాన్ లో ఉన్న మొత్తం బీజేపీ నాయకులను అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.
ప్రతిరోజూ తనపై , పార్టీపై విమర్శలు గుప్పించడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గౌతం అదానీకి మధ్య ఉన్న సంబంధం గురించి పవన్ ఖేరా ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆనాటి పీఎంలు నరసింహారావు, వాజ్ పేయిలు పార్లమెంటరీ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరి మీరెందుకు ఏర్పాటు చేయలేక పోయారంటూ మోదీని నిలదీశారు. ఇది తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు అశోక్ గెహ్లాట్.
వ్యవస్థలను నీరుగార్చి పూర్తిగా ఏకశ్చాత్రిధిపత్యం చెలాయిస్తానంటే ఎలా అని మండిపడ్డారు సీఎం. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఒక రకంగా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు అశోక్ గెహ్లాట్. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయడం సంతోషం వ్యక్తం చేశారు.
ఈ దేశంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించే సంస్కారం ప్రధానమంత్రికి ఉండాల్సిన అవసరం ఉందన్నారు అశోక్ గెహ్లాట్.
Also Read : అదుపులో ఉంటే అంత మంచిది – సీజేఐ