Arvind Kejriwal : 10 రోజుల్లో సిసోడియా అరెస్ట్ – కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మద్యం పాలసీ స్కాం పేరుతో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలు చేపట్టింది.
ఆయనతో పాటు మొత్తం 15 మందిపై కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో సిసోడియా(Manish Sisodia) నివాసంలో సీబీఐ 14 గంటలకు పైగా సోదాలు చేపట్టింది.
డిప్యూటీ సీఎంకు చెందిన మొబైల్ తో పాటు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లను సీజ్ చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.
మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కావాలని బీజేపీయేతర ప్రభుత్వాలను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఇప్పటికే షిండే పేరుతో మరాఠాలో మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి వేసిందని గుర్తు చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలోకూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇదిలా ఉండగా సీఎం, డిప్యూటీ సీఎం కలిసి గుజరాత్ లో రెండు రోజుల టూర్ లో భాగంగా పర్యటిస్తున్నారు.
ఆప్ కు అనూహ్యమైన ఆదరణ లభించడం ఒకింత సంతోషానికి లోనయ్యారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా మరో మూడు రోజుల్లో మనీష్ సిసోడియా అరెస్ట్ కాబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళారం గుజరాత్ లోని భావ్ నగర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. సిసోడియాను 10 రోజుల్లో అరెస్ట్ చేస్తారని తమకు సమాచారం ఉందన్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి ఆప్ లో.
Also Read : డ్యాన్సర్ స్వప్నా చౌదరికి అరెస్ట్ వారెంట్