Artificial Intelligence: బెంగాల్ జైళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కెమరాలు ఏర్పాటు
బెంగాల్ జైళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కెమరాలు ఏర్పాటు
Artificial Intelligence : జైళ్లలో నేరగాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. నేరగాళ్లపై నిఘా కోసం ఏఐ (Artificial Intelligence) ఆధారిత కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇటీవల బెంగాల్‌లోని పరివర్తన కేంద్రాల్లో శిక్ష అనుభవిస్తున్న కరడుగట్టిన నేరగాళ్లు బయట జరిగే నేరాలకు జైళ్ల నుంచి ప్రణాళికలు వేయడం, గంజాయి అక్రమ రవాణా, బెదిరింపులు, హత్యలు వంటి నేరాలకు ప్లాన్ చేస్తుండడంతో జైలు కేంద్రాలు నేరాలకు నిలయాలుగా మారాయన్నారు. అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించి, అడ్డుకునేందుకు వీలుగా ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.
Artificial Intelligence Cameras
బెంగాల్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 60 పరివర్తన కేంద్రాల్లో ఇప్పటికే అత్యాధునిక కెమెరాలు ఉన్నప్పటికీ ఖైదీలు తమ దృష్టినుంచి తప్పించుకుంటున్నారని పోలీసులు పేర్కొన్నారు. అందువల్లే వాటిని ఏఐ (AI)తో అనుసంధానిస్తున్నామన్నారు. ప్రతి ఖైదీ బయోమెట్రిక్ వివరాలను ఇందులో పొందుపరుస్తామన్నారు. ఇవి సాధారణ కెమెరాల్లా రికార్డు అవడమే కాక జైలు లోపల అనుమానాస్పద కదలికలు, తగాదాలు, విధ్వంసం, తప్పించుకునే ప్రయత్నాలు వంటివాటిని గుర్తించి వెంటనే జైలు గార్డులను అప్రమత్తం చేస్తాయని తెలిపారు. ఇందులో ఉన్న ముఖగుర్తింపు ద్వారా భోజన సమయాల్లో, హాజరు తీసుకునే సమయంలో గైర్హాజరైన వారిని, పారిపోవడానికి ప్రయత్నించిన వారిని ట్రాక్ చేసి అధికారులను అప్రమత్తం చేస్తుందన్నారు ఈ ఏఐ ఆధారిత కెమెరాలు.
ముఖ్యమైన కేసుల్లో అరెస్టైన కరడుగట్టిన నేరగాళ్లు ప్రత్యేక నిఘాలో ఉంటారని తెలిపారు. అంతేకాకుండా ఏఐ ద్వారా జైళ్లలో సెల్‌ఫోన్లు, పదునైన ఆయుధాలు, మాదకద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులను గుర్తించవచ్చని తెలిపారు. ఈ AI-ఆధారిత వీడియో విశ్లేషణలు ఖైదీల ప్రవర్తన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ధోరణులను కూడా అంచనా వేయగలవన్నారు. దీనివల్ల అధికారులు ముందుగానే జోక్యం చేసుకొని.. దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు.
Also Read : Edappadi Palaniswami: హీరో విజయ్‌వి పగటి కలలే – మాజీ సీఎం పళనిస్వామి
