Arvind Kejriwal: దిల్లీ ప్రజలారా ఆందోళన చెందొద్దు అన్ని సమస్యలు తొలగుతాయి : కేజ్రీవాల్
దిల్లీ ప్రజలారా ఆందోళన చెందొద్దు అన్ని సమస్యలు తొలగుతాయి : కేజ్రీవాల్
Arvind Kejriwal: ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యి కొన్నిరోజుల క్రితం సీఎం పీఠాన్ని వదులుకున్న ఆయన తాజాగా భాజపాపై విమర్శలు చేశారు. ఈ క్రమం లో పలు పార్టీ నేతలతో సమవేశాం అవుతున్నా సందర్బంలో ఓ పార్టీ నేత చెప్పిన మాటలు తనను షాక్ గురిచేశాయని అన్నారు. నా అరెస్టు వల్ల ఏం లాభం దక్కిందని.. ఇటీవల నేను భాజపాకు చెందిన సీనియర్ నేతను అడిగాను. ఆయన చెప్పిన మాటలు విని నేను షాక్ అయ్యా. దిల్లీలో పాలన పట్టాలు తప్పిందని, పనులు ఆగిపోయాయని ఆ నేత బదులిచ్చారు. దిల్లీలో పనులు ఆగిపోయేలా చేసి, పాలన పట్టాలు తప్పేలా చేసి, ప్రజలకు అసౌకర్యం కలిగించడమే వారి ఉద్దేశమా? దిల్లీ ప్రజలారా మీరు ఆందోళన చెందొద్దు. నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ మొదలవుతాయి. అన్ని సమస్యలు తొలగుతాయి. జైల్లో కూడా యాక్షన్ మోడ్‌లోనే ఉన్నాను అని కేజ్రీవాల్(Arvind Kejriwal) వ్యాఖ్యానించారు.
Arvind Kejriwal – దిల్లీ అసెంబ్లీలో కొత్త సీటింగ్ ప్లాన్ : ఆతిశీ
నూతన ముఖ్యమంత్రి ఆతిశీకి మొదటి సీటు కేటాయించారు. గతంలో ఆ నంబర్ 19గా ఉండేది. ఇంతకాలం తొలిసీటులో కూర్చున్న ఆయనకు 41వ సీటు కేటాయించారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యే సీట్ల స్థానాలు కూడా మారాయి. ఇదిలా ఉంటే.. ఆతిశీ సీఎం పదవిని చేపట్టినా కేజ్రీవాల్ కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాకు ప్రస్తుతం భరతుడికి ఎదురైన పరిస్థితే ఉంది. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు.. భరతుడు పాలించాల్సి వచ్చింది. సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలాడు. ఈ కుర్చీ అరవింద్ కేజ్రీవాల్‌ది. నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో దిల్లీలో మళ్లీ ఆయన అధికారాన్ని చేపడతారని విశ్వసిస్తున్నా. ఆయన తిరిగివచ్చేవరకు ఈ కుర్చీ ఇక్కడే ఉంటుంది అని ఆతిశీ అన్నారు.
Also Read : Chidambaram: రిజర్వేషన్లను పూర్తిగా రద్దే చేసేందుకు మోదీ ప్రభుత్వం వెనకాడదు: చిదంబరం కీలక వ్యాఖ్యలు