Arvind Kejriwal : కూల్చి వేతలపై కేజ్రీవాల్ ఆగ్రహం
అతి పెద్ద విధ్వంసమంటూ కామెంట్
Arvind Kejriwal : ఢిల్లీలో అక్రమ కట్టడాల పేరుతో బుల్ డోజర్లతో కూల్చి వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. స్వతంత్ర భారత దేశంలో అతి పెద్ద విధ్వంసమని ఆయన పేర్కొన్నారు.
సోమవారం ఈ అంశంపై ప్రధానంగా స్పందించారు. ఆక్రమణల నిరోధక డ్రైవ్ ను నిర్వహిస్తున్న విధానానికి పార్టీ వ్యతిరేకమని , దాదాపు 50 లక్షల మంది అనధికార కాలనీల్లో , 10 లక్షల మంది చిన్న గుడిసెల్లో ఉంటున్నారని పేర్కొన్నారు.
కూల్చి వేతలను వ్యతిరేకించినందుకు జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని ఆప్ ఎమ్మెల్యేలను ఆయన కోరారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో చేపడుతున్న ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ ను దూషిస్తూ 63 లక్షల మంది ప్రజల దుకాణాలు, ఇళ్లను బుల్ డోజర్లు ధ్వంసం చేయడం దారుణమన్నారు.
ఇది అతి పెద్దదన్నారు. ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కూల్చి వేతల వెనుక పూర్తిగా రాజకీయ కుట్ర కోణం దాగి ఉందన్నారు.
బీజేపీ నేతృత్వంలోని మున్సిపల్ కార్పొరేషన్లు చేపడుతున్న ఈ విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు సీఎం. బుల్ డోజర్లు ఎవరి మాట వినడం లేదన్నారు.
ఇది అక్రమ కట్టడం కాదని, దానికి సంబంధంచిన ధ్రువీకరణ పత్రాలు చూపించినా పట్టించు కోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆప్ చీఫ్. ఢిల్లీని ప్రణాళికాబద్దంగా తయారు చేయలేదని, దీంతో ఈ ఇబ్బంది ఏర్పడిందన్నారు.
ఈ నగరాన్ని సుందరంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, కానీ విధ్వంసం సృష్టించాలని ప్రయత్నం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).
Also Read : కట్టుదిట్టంగా జ్ఞాన్ వాపి మసీదు సర్వే