Arvind Kejriwal : విజ‌న్ ఉన్న నేత అర‌వింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సీఎంకు శుభాకాంక్ష‌ల వెల్లువ‌

Arvind Kejriwal : భార‌త‌దేశ రాజ‌కీయాల‌లో అరుదైన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఆగ‌స్టు 16న సీఎం పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. రెండోసారి ఢిల్లీలో సీఎంగా కొలువు తీరారు. ఆయ‌న స్వ‌స్థ‌లం హ‌ర్యానా. భార‌తీయ సామాజిక‌వేత్త‌, రాజ‌కీయ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఐఐటీ ఖ‌ర‌గ్ పూర్ లో మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ చదివారు. భార‌తీయ రెవిన్యూ స‌ర్వీస్ లో చేరారు. జ‌న్ లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హ‌జారేతో క‌లిసి పోరాడారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టం తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు అర‌వింద్ కేజ్రీవాల్.

Arvind Kejriwal Life Story

పేద వారి స్థోమ‌త పెంచేందుకు చేసిన కృషికి 2006లో రామ‌న్ మెగ‌సెసే పుర‌స్కారం ద‌క్కింది. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో రాజ‌కీయ పార్టీని స్థాపించారు. తొలి ఎన్నిక‌ల్లోనే 2013లో ఢిల్లీలో ఆప్ ను విజ‌య ప‌థాన న‌డించారు. ఢిల్లీకి 7వ సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీకి ప్రాతినిధ్యం వ‌హించిన ముఖ్య‌మంత్రుల‌లో అత్యంత త‌క్కువ వ‌య‌సు క‌లిగిన వ్య‌క్తిగా చ‌రిత్ర సృష్టించారు అర‌వింద్ కేజ్రీవాల్.

ప‌రివ‌ర్త‌న్ అనే సామాజిక సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. ఢిల్లీ వాసుల‌కు ప‌న్నులు, విద్యుత్, ఆహార పంపిణీ విష‌యాల గురించి అవ‌గాహ‌న క‌ల్పించారు. మార్పు అనేది చిన్న చిన్న విష‌యాల‌తో ప్రారంభం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Foxconn Apple Air Pods : హైద‌రాబాద్ పై ఫాక్స్ కాన్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!