Arvind Kejriwal : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భావోద్వేగానికి లోనయ్యారు. ఆపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా తన సహచచరుడు, విద్యా రంగానికి ఎనలేని కృషి చేసిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను తలుచుకుని ఆవేదనకు లోనయ్యారు. తన పక్కన లేక పోవడం తనను ఎంతో వేదనకు గురి చేస్తోందని వాపోయారు.
ఢిల్లీలో విద్యా, ఆరోగ్య రంగానికి సంబంధించి ఎన్నో కలలు కన్నారని కొనియాడారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఏ నేరం చేయక పోయినప్పటికీ కేంద్రం కావాలని మనీష్ సిసోడియాను ఇరికించిందని, జైల్లో పెట్టిందని వాపోయారు. ఈ సందర్భంగా తాను శరీరంలో ఒక భుజాన్ని కోల్పోయానని పేర్కొన్నారు సీఎం.
ఇవాళ తనకు బాధగా ఉందని, ఈ మొత్తం క్రెడిట్ అంతా మనీష్ కే దక్కుతుందని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆయన లేక పోవడం వెలితిగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ విద్య అందించాలన్నదే సిసోడియా కల. దానిని నెరవేర్చేందుకు అహోరాత్రులు శ్రమించారని కొనియాడారు కేజ్రీవాల్. ఆయన గనుక లేక పోతే నగరం ఇలా ఉండేది కాదన్నారు. ఇవాళ అత్యాధునిక సౌకర్యాలతో యూనివర్శిటీని కూడా ప్రారంభించడం జరిగిందన్నారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : KTR : ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం – కేటీఆర్