Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది...
Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ భూన్యా ఇద్దరూ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు. సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది. దీనికి ముందు, ఈడీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నుండి బెయిల్ కూడా పొందారు. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ కేసు సీబీఐ చేసిన అరెస్ట్, రెగ్యులర్ బెయిల్‌కు సంబంధించినది. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు జులై 12న సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది. అదే సమయంలో ఇప్పుడు సీబీఐ కేసులో కూడా కేజ్రీవాల్(Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన అనంతరం జూన్ 26న తీహార్ జైలు నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ మార్చి 21న అరెస్టు అయ్యారు.
Arvind Kejriwal Got Bail..
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. ఐదున్నర నెలల పాటు తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్దం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. అలాగే లిక్కర్ కేసుపై మాట్లాడవద్దని సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌కు అదేశించింది. అలాగే బెయిల్ మంజూరు చేస్తూ రూ.10 లక్షల బాండ్‌ను సమర్పించాలని షరతు విధించింది.
Also Read : Kapil Sibal: ప్రధాని మోదీ సీజేఐ ఇంటికి వెళ్లడంపై కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ విసుర్లు !