Arvind Kejriwal : గుజ‌రాత్ లో గాడి త‌ప్పిన బీజేపీ పాల‌న

నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal : ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. గుజ‌రాత్ రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. గ‌త 27 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌న్నారు.

త‌మ‌కేం అన్న గ‌ర్వం పేరుకు పోయింద‌న్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ లో గుజ‌రాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఆప్ చీఫ్ ఈ రాష్ట్రంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు.

ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌ర్య‌టించారు. స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. రెండు రోజుల టూర్ లో భాగంగా రాష్ట్రంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ స‌ర్కార్ ను ఏకి పారేస్తున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌ణ‌నీయంగా ఓటు బ్యాంకును సాధించింది ఆప్. కాంగ్రెస్ హ‌యాంలో ఉన్న పంజాబ్ లో ఏకంగా 92 సీట్లు సాధించి అధికారంలోకి వ‌చ్చింది.

ఈసారి ఎలాగైనా దేశంలోని ప‌లు రాష్ట్రాల‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని ప్లాన్ చేశారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఆయ‌న ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇస్తున్నారు.

ప్ర‌ధానంగా దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతున్నా ఎందుకుని ఇంకా ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేస్తూనే త‌మ‌కు ఒక్క‌సారి ఛాన్స్ ఇవ్వ‌మంటూ కోరుతున్నారు.

ప్ర‌జ‌లే వేదిక‌గా త‌మ మేనిఫెస్టో ఉంటుంద‌ని ప్ర‌క‌టించాచ‌రు. మొత్తంగా ఆప్ కు భారీగా జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంది. క‌ల్తీ మ‌ద్యం బాధితులు చ‌ని పోతే ఈరోజు వ‌ర‌కు సీఎం ప‌రామ‌ర్శించిన పాపాన పోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు అర‌వింద్ కేజ్రీవాల్.

Also Read : ఢిల్లీ స‌ర్కార్ కు షాకిచ్చిన ఎల్జీ స‌క్సేనా

Leave A Reply

Your Email Id will not be published!