Arvind Kejriwal : ప్రతి ఒక్కరితో కేంద్రం పేచీ – కేజ్రీవాల్
గొడవ పడితే దేశం అభివృద్ది చెందుతుందా
Arvind Kejriwal : కేంద్ర సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రతి ఒక్కరితో కేంద్రం గిల్లి కజ్జాలు పెట్టుకుంటోందంటూ మండిపడ్డారు. న్యాయమూర్తులు, రైతులతో కావాలని వాగ్వాదానికి దిగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. కేంద్రం అందరిపై ఎందుకు పోరాడుతోందంటూ ప్రశ్నించారు.
ప్రత్యేకించి గత కొంత కాలం నుంచి న్యాయమూర్తులు, రైతులతో కావాలని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ధ్వజమెత్తారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో కొలువు తీరిన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా పదే పదే అడ్డంకిగా మారారని ఆరోపించారు. కేంద్రం ఎల్జీని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రాలు, న్యాయమూర్తులు, రైతులు, వ్యాపారులతో సహా అందరితోనూ పోరాడుతోందని ఢిల్లీ సీఎం ఎద్దేవా చేశారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ సుప్రీంకోర్టు ,కేంద్రం మధ్య ప్రధాన ఫ్లాష్ పాయింట్ గా మారిందని పేర్కొన్నారు. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దని అరవింద్ కేజ్రీవాల్ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సూచించారు.
అందరితో గొడవలు పెట్టుకుని దేశం అభివృద్ది చెందదన్నారు.ఢిల్లీ ఆప్ సర్కార్ కు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లాగా మారి పోయింది. ఎల్జీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) తీసుకున్న నిర్ణయాలపై ఆరా తీస్తున్నారు. వాటి నిర్వహణపై విచారణకు ఆదేశించారు.
టీచర్లను శిక్షణ కోసం ఫిన్లాండ్ కు పంపాలన్న ప్రతిపాదనను కావాలని సక్సేనా నిలిపి వేశారంటూ ఆరోపించారు ఢిల్లీ సీఎం.
Also Read : కేజ్రీవాల్ రాజీనామా చేయలి – బీజేపీ