Arvind Kejriwal : బడా బాబుల సేవలో మోదీ – కేజ్రీవాల్
లక్షన్నర కోట్ల రుణాలు మాఫీ
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన ఢిల్లీ వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని 140 కోట్ల మందికి 200 యూనిట్ల విద్యుత్ మాఫీ చేయాలంటే కేవలం లక్షన్నర కోట్ల రూపాయలు మాత్రమే కావాల్సి ఉంటుందన్నారు. కానీ దీని గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచించరని ఎద్దేవా చేశారు.
Arvind Kejriwal Words About Independence Day
ఆయన కేవలం బడా బాబుల సేవలో మునిగి తేలుతున్నాడని, ఓ వైపు దేశం యావత్తు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే తను మాత్రం విదేశాల పర్యటనల మోజులో ఉన్నాడంటూ మండిపడ్డారు. ఇందు కోసమేనా మిమ్మల్ని గెలిపించింది. ప్రజలు ఎన్నటికీ ప్రధానిని క్షమించరని హెచ్చరించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఇప్పటికే కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని చెల్లించకుండా ముఖం చాటేసిన వాళ్లను విడిచి పెట్టారని ఆరోపించారు. మరికొందరు ఆర్థిక నేరస్థులు దేశం దాటి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). కేవలం నలుగురు బిలియనీర్లకు సంబంధించి చేసిన కోట్లాది రూపాయల అప్పుల్ని ఒకే ఒక్క సంతకంతో మాఫీ చేశారని ధ్వజమెత్తారు .
Also Read : Pawan Kalyan : త్రివర్ణ పతాకమా వర్ధిల్లుమా