Arvind Kejriwal : మోదీకి నిద్ర ప‌ట్ట‌డం లేదు – కేజ్రీవాల్

ఎన్నిసార్లు విచార‌ణ చేప‌ట్టినా వేస్ట్

Arvind Kejriwal  : న్యూఢిల్లీ – ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారు. గ‌త కొన్నేళ్లుగా త‌న‌ను , త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చాల‌ని ప్ర‌య‌త్నాలు కొనసాగుతూ వ‌చ్చాయ‌ని ఆరోపించారు సీఎం.

అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ) మీడియాతో మాట్లాడారు. నాపై విచార‌ణ కొత్తేమీ కాద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త 8 ఏళ్ల కాలంలో 50కి పైగా కేసులు న‌మోదు అయ్యాయ‌ని, కానీ ఏ ఒక్క కేసులో ఆధారాలు చూప‌లేక పోయార‌ని స్ప‌ష్టం చేశారు.

Arvind Kejriwal Comments Modi

స్కూల్స్ బిల్డింగ్ , బ‌స్సుల కొనుగోలు స్కాం, లిక్క‌ర్ స్కామ్ , రోడ్ స్కామ్ , వాట‌ర్ స్కామ్ , క‌రెంట్ స్కాంల‌లో తాను అవినీతి , అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు మోదీ , కేంద్ర స‌ర్కార్ ఆరోపించింద‌న్నారు. కానీ ఒక్క ఆధారం విచార‌ణ సంస్థ‌ల‌కు ల‌భించ లేద‌ని ఎద్దేవా చేశారు అర‌వింద్ కేజ్రీవాల్.

దీంతో న‌న్ను చూస్తే మోదీకి నిద్ర ప‌ట్ట‌డం లేద‌న్నారు. అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి మోదీలు ఎంత మంది వ‌చ్చినా లేదా ఎన్ని విచార‌ణ‌లు చేసినా ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని అన్నారు సీఎం. ఇక‌నైనా ఇలాంటి చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌లు మానుకుంటే మంచిద‌న్నారు.

నాపై సీబీఐ ఎంక్వైరీ వేసిన మోదీ సైతం తాను కూడా విచార‌ణ‌కు సిద్దం కావాల‌ని స‌వాల్ విసిరారు అర‌వింద్ కేజ్రీవాల్. ఈ విచార‌ణ‌లో ఏమీ దొర‌క‌క పోతే తాను ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు సీఎం.\

Also Read : Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 2.98 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!