Aryan Khan : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ (Bolly Wood) నటుడు తనయుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) కేసుకు సంబంధించి కీలక మార్పు చోటు చేసుకుంది. ఇప్పటికే ఇది కావాలని తమను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇరికించారంటూ ఆర్యన్ ఖాన్ (Aryan Khan )తరపు న్యాయవాది వాదించారు.
ఈ మేరకు బెయిల్ దొరికింది. అంతకు ముందు అరెస్ట్ కూడా చేశారు. ఈ సమయంలో మంత్రి నవాబ్ మాలిక్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన కూడా పోలీసు కస్టడీలో ఉన్నారు.
ఈ తరుణంలో మరోసారి ఆర్యన్ ఖాన్ (Aryan Khan) కేసు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా చార్జిషీట్ దాఖలు చేసేందుకు గాను మరికొంత గడువు కావాలని ఎన్సీబీ (NCB) కోరింది. ఈ మేరకు కోర్టుకు విన్నవించింది.
ఆరు నెలల గడువు పూర్తయింది. కానీ ఈరోజు వరకు ఏ ఆరోపణలు అయితే ఎన్సీబీ (NCB) చేసిందో అందుకు సంబంధించి చార్జి షీటు నమోదు చేయలేదు.
ఇదిలా ఉండగా ఇవాళ ఎన్సబీ మరోసారి ఆరు నెలల గడువు కోల్పోయే సమయం వచ్చిందని, కావున మరికొంత సమయం కావాలని సూచించింది.
ఈ మేరకు మరో 90 రోజులు పొడిగించాలన్న అభ్యర్థనకు ఒక సాక్షి శత్రుత్వం వహించడమే ప్రధాన కారణమని ఆరోపించింది. కాగా డ్రగ్స్ (Drugs) కేసులో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ 22 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు.
క్రూయిజ్ షిప్ ఏసులో ఖాన్ పై ఎన్సీబీ (NCB) కేసు దాఖలు చేసింది. హై ఫ్రొఫైల్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 2 లోగా ఏజెన్సీ ఛార్జిషీట్ ను సమర్పించాల్సి ఉంది.
Also Read : బాబాయ్ వర్గీయులపై అబ్బాయి వేటు