Asaduddin Owaisi: పాకిస్తాన్‌ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

పాకిస్తాన్‌ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi : భారత్‌ లోని హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే భారత ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.

Asaduddin Owaisi Shocking Comments on Pakistan

ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మారణహోమం సృష్టిస్తోందని, పహాల్గామ్‌(Pahalgam) లో అతికిరాతకంగా అమాయక ప్రజలను హతమార్చిందని విమర్శించారు. అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌ తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారని… దీనికి పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లలు, అమాయకులను చంపే పాక్‌ కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని అన్నారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపాలని ఇస్లాం చెప్పలేదని, ఇస్లాం పేరుతో పాక్‌ అసత్య ప్రచారం చేస్తోందని మండి పడ్డారు. దేవుడి దయతో మనం భారత భూమిని జన్మించాం. భారత భూమి కోసం ప్రాణాలైన ఇస్తాం. పాక్‌ దాడులపై భారత్‌ వెనక్కి తగ్గేది లేదని, భారత ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ మనదేశంలోని సామాన్యులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోందని, దానికి తగిన మూల్యం చెల్లిచుకుంటుందని ఒవైసీ అన్నారు. ప్రస్తుతం ఒవైసీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Also Read : India: భారత్ – పాక్ యుద్దానికి బ్రేక్ ! దృవీకరించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ !

Leave A Reply

Your Email Id will not be published!