Asaduddin Owaisi: బీఆర్‌ఎస్‌ది తప్పుడు వ్యూహం – అసదుద్దీన్ ఒవైసీ

బీఆర్‌ఎస్‌ది తప్పుడు వ్యూహం - అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi: లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ దారుణ ఓటమిపై తెలంగాణవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్‌ఎస్‌ నేతలు ఆత్మబలిదానం చేసుకు‍న్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సైతం బీఆర్‌ఎస్‌ జీరో ఫలితంపై స్పందించారు.

Asaduddin Owaisi….

బీఆర్‌ఎస్‌ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ 8 చోట్ల డిపాజిట్‌ కోల్పోవడానికి క్రాస్‌ ఓటింగే కారణమైంది. బీఆర్‌ఎస్‌ ఇలా ఎందుకు చేసిందో నాకైతే తెలియదు. రాజకీయ వ్యూహంలో భాగం అనుకున్నా… అది తప్పుడు వ్యూహం అని ఒవైసీ అన్నారు. ప్రస్తుతం ఒవైసీ వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Also Read : Naveen Patnaik: సీఎం పదవికి నవీన్‌ పట్నాయక్‌ రాజీనామా ! ఒడిశా తదుపరి సీఎం ఎవరో ?

Leave A Reply

Your Email Id will not be published!