Ashok Gehlot : కాంగ్రెస్ చీఫ్ ఎన్నికపై గెహ్లాట్ కామెంట్స్

రాహుల్ గాంధీనే కోరుకుంటున్నారు

Ashok Gehlot : త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కేంద్రంలో రెండోసారి కొలువు తీరిన మోదీ బీజేపీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది.

దేశంలో ఏక పార్టీ పాల‌న ఉండాల‌న్న‌ది ఆ పార్టీ ల‌క్ష్యం. ఆ దిశంగా చాప కింద నీరులా విస్త‌రిస్తోంది. త‌న‌కు లొంగి ఉంటే స‌రి లేక పోతే బీజేపీ యేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చి వేసే ప‌నిలో బిజీగా ఉంది.

ఈ త‌రుణంలో బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు కాంగ్రెస్ నానా తంటాలు పడుతోంది. 134 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు త‌న గ‌త చ‌రిత్ర‌ను చూసి త‌లుచుకుంటోంది.

గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓట‌మి పాలైంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం గాంధీ పేరు మీదే పార్టీ బ‌తుకుతోంది. సీనియ‌ర్లు ఒక్క‌రొక్క‌రుగా వీడుతున్నారు.

సోనియా గాంధీ ప్ర‌స్తుతం ఏఐసీసీకి తాత్కాలిక చీఫ్ గా కొన‌సాగుతున్నారు. నాలుగు అయిదు రోజుల్లో పార్టీకి సంబంధించి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు చీఫ్ ఎన్నిక కోసం ముహూర్తం కూడా ఖ‌రారు చేసింది పార్టీ.

సెప్టెంబ‌ర్ 20న కొత్త అధ్య‌క్షుడి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఎన్నిక నిర్వ‌హించేందుకు గాను ఎల‌క్ష‌న్ అథారిటీని కూడా నియ‌మించింది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ ను కూడా జారీ చేసింది.

కాగా పార్టీకి సంబంధించి అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధీనే ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని అన్నారు సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీలోనే ప్ర‌జాస్వామ్యం అన్న‌ది నెల‌కొని ఉంద‌న్నారు.

Also Read : గుజ‌రాత్ స‌ర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసు

Leave A Reply

Your Email Id will not be published!