Ashwini Vaishnaw: టైమ్‌ జాబితాలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ !

టైమ్‌ జాబితాలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ !

Ashwini Vaishnaw: ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఏటా విడుదల చేసే ‘మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐ 2024’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 100 మంది మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ పేర్లను టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ ‘మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐ 2024’ జాబితాలో భారతీయులు, భారతీయ మూలాలున్న 15 మందికి చోటు లభించింది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్, ఆధార్‌ కార్యక్రమ రూపకర్త అయిన ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నిలేకనీలు కృత్రిమమేధ (ఏఐ) రంగంలో తమదైన ముద్ర వేసినట్లు కితాబిచ్చింది.

Ashwini Vaishnaw…

వచ్చే అయిదేళ్లలో సెమీకండక్టర్ల ఉత్పత్తిపరంగా భారత్‌ ను టాప్‌-5లో నిలబెట్టేందుకు అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnaw) చేస్తున్న కృషిని ప్రస్తుతించింది. కేంద్ర మంత్రిగా ఉంటూ టైమ్స్ మ్యాగజైన్ ‘మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఇన్‌ ఏఐ 2024’ జాబితాలో చోటు దక్కించుకోవడంపై అశ్వినీ వైష్ణవ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అనిల్‌ కపూర్‌ కృత్రిమమేధ ద్వారా తన పోలికలు, వీడియోలు, ఎమోజీలు, గొంతును దుర్వినియోగం చేయడాన్ని సవాలు చేస్తూ గతేడాది కోర్టులో కేసు వేసి గెలిచారు. ఈ జాబితాలో వివిధ కంపెనీల వ్యవస్థాపకులు, సహ వ్యవస్థాపకులు, సీఈవోలు 40 మంది ఉన్నారు.

మార్క్‌ జుకర్‌ బర్గ్‌ (మెటా), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్‌), సుందర్‌ పిచాయ్‌ (గూగుల్‌), అరవింద్‌ శ్రీనివాస్‌ (పర్‌ప్లెక్జిటీ)తోపాటు ఏఐ నౌ సహ కార్యనిర్వాహక సంచాలకురాలు అంబా కాక్, అమెరికా విజ్ఞాన సాంకేతిక కార్యాలయం సంచాలకురాలు ఆరతి ప్రభాకర్, కలెక్టివ్‌ ఇంటెలిజెన్స్‌ సహ వ్యవస్థాపకురాలు దివ్యా సిద్ధార్థ్‌ ఉన్నారు. ఏఐ రంగాన్ని శాసిస్తున్న రోహిత్‌ ప్రసాద్‌ (అమెజాన్‌), శివరావు (ఎబ్రిడ్జ్‌), అనంత్‌ విజయ్‌సింగ్‌ (ప్రొటాన్‌), ద్వారకేశ్‌ పటేల్‌ (ద్వారకేశ్‌ పాడ్‌కాస్ట్‌), అమన్‌దీప్‌ సింగ్‌ గిల్‌ (ఐరాస సాంకేతిక విభాగం), వినోద్‌ ఖోస్లా (ఖోస్లా వెంచర్స్‌)లకు ఈ జాబితాలో చోటు దక్కింది.

Also Read : Budameru Floods Effect: బుడమేరు ఎఫెక్ట్‌ తో కొల్లేరుకు కొత్త టెన్షన్‌ !

Leave A Reply

Your Email Id will not be published!