Ashwini Vaishnaw : రాజకీయాలకు ఇది సమయం కాదు
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
Ashwini Vaishnaw : ఒడిశా రైలు దుర్ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw). ఆయన తక్షణమే రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కు కూడా గురవుతున్నారు. ఈ తరుణంలో ఘటన జరిగిన విషయం తెలుసుకున్నప్పటి నుంచీ బాలా సోర్ లోనే మకాం వేశారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు చేసేందుకు సమయం కాదన్నారు.
ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. భారీగా ప్రాణ నష్టం జరిగింది. బాధితులను ఆస్పత్రుల్లో చేర్చడం జరిగిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తాము పూర్తిగా పారదర్శకతను కోరుకుంటున్నామని, సహాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇప్పటికే ట్రాక్ లను పునరుద్దరించే పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 500 దాకా మరణించి ఉంటారని చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. అంత ఎక్కువ సంఖ్యలో చని పోలేదని చెప్పారు అశ్విని వైష్ణవ్. ఇదిలా ఉండగా మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 288 మంది మరణించారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు.
Also Read : Security Advisor