S Jai Shankar : ఉగ్రవాదమా అయితే పాకిస్తాన్ ను అడగండి
జర్నలిస్ట్ కు జై శంకర్ దిమ్మ తిరిగే ఆన్సర్
S Jai Shankar : ఉగ్రవాదంపై పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చారు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. తీవ్రవాదం గురించి కదూ మీరు అడుగుతున్నది..అయితే మీ పాకిస్తాన్ దేశాన్ని అడగండి అంటూ దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చారు.
ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పు ఏదైనా ఉందంటే అది ఉగ్రవాదం ఒక్కటే. అన్ని దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఆ దేశంలో అది తప్ప ఇంకేమీ లేదన్నారు ఎస్ జై శంకర్(S Jai Shankar). గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం అప్రోచ్ – ఛాలెంజెస్ అండ్ వే ఫార్వర్డ్ అనే అంశానికి సంబంధించి ఐక్య రాజ్య సమితిలోని భద్రతా మండలిలో భారత్ అధ్యక్షత వహించింది.
ఈ సదర్భంగా జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ దేశమే దానికి మద్దతు పలుకుతోంది. ఇక నన్ను అడిగితే ఎలా అని ప్రశ్నించారు. తమ దేశం ఎప్పుడూ యుద్దాన్ని కోరుకోదన్నారు. అన్ని దేశాలతో సత్ సంబంధాలను కొనసాగించాలని ప్రయత్నం చేస్తుందన్నారు. అందుకే తమ విదేశాంగ విధానం గురించి తమ కంటే బాగా మీ మాజీ దేశ ప్రధాని,
మాజీ పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను అడిగితే మీకు తగిన రీతిలో జవాబ్ వస్తుందన్నారు. ఎందుకంటే లాహోర్ లో జరిగిన బహిరంగ ర్యాలీలో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇండియన్ ఫారిన్ పాలసీ గురించి ప్రశంసలు కురిపించారు. భారత్ ఎల్లప్పుడూ ఎవరి పంచన చేరదని ఎస్ జై శంకర్ స్పష్టం చేశారు. దీనిని గుర్తిస్తే బావుంటుందని సూచించారు .
Also Read : ప్రపంచం పాక్ ను ఉగ్రవాద దేశంగా చూస్తోంది