Assam Meghalaya : అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు ఓ అడుగు ముందుకు వేశాయి. గత 50 సంవత్సరాలుగా ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు (Boarder) వివాదాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ముగింపు పలకాలని నిశ్చియించాయి.
ఇవాళ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశాయి. 1972లో అస్సాం నుంచి మేఘాలయ (Meghalaya) విడిపోయింది. ఈ సందర్భంగా ఆనాటి నుంచి నేటి దాకా సరిహద్దు (Boarder) వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
దీర్ఘ కాలంగా భూమి వివాదం మరింత జఠిలంగా మారింది. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమక ఒప్పందంలో సరిహద్దుల (Boarder) విభజన అన్నది కీలకంగా మారింది. దీంతో సరిహద్దు (Boarder) సమస్యలు మరింత పెరిగాయి.
తమ రాష్ట్రాల మధ్య 50 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించు కోవాలని నిర్ణయం తీసుకున్నారు అస్సాం సీఎం (CM) హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ సీఎం (CM) కాన్రాడ్ సంగ్మా. ఈ మేరకు ఒప్పందంపై (Assam Meghalaya)సంతకాలు చేశారు.
రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య కొన్నేళ్లుగా ఉన్న వివాదానికి ముగింపు పలికేందుకు గాను మంగళవారం న్యూ ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సమక్షంలో వీరిద్దరూ సంతకాలు చేశారు.
ఇదిలా ఉండగా ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలను(Assam Meghalaya) పరిష్కరించేందుకు తమకు దిశా నిర్దేశం చేసిన మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని తెలిపారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.
ఈ సందర్భంగా సంగ్మా కూడా థ్యాంక్స్ చెప్పారు షాకు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారానికి చొరవ చూపారు అమిత్ షా.
Also Read : బాధితుల ఆరోపణలు అబద్దం