Bal Thackeray : బాల్ ఠాక్రే ఫ్యామిలీకి అసిస్టెంట్ గుడ్ బై
సీఎం ఏక్ నాథ్ షిండే క్యాంపు లోకి జంప్
Bal Thackeray : శివసేన పార్టీకి మరో షాక్ తగిలింది. ఇదిలా ఉండగా శివసేన పార్టీని స్థాపించిన మరాఠా యోధుడిగా పేరొందిన బాల్ ఠాక్రేకు అసిస్టెంట్ గా పని చేశాడు చంపా సింగ్ థాపా. థాపా ఏకంగా 27 ఏళ్ల పాటు పని చేశాడు. ఉన్నట్టుండి విశిష్ట సేవలకు గుడ్ బై చెప్పాడు. బాల్ థాక్రే కు నమ్మకమైన సహాయకుడిగా పని చేస్తూ వచ్చాడు.
రోజూ వారీ పనులలో సహాయ పడుతూ వచ్చాడు. నవంబర్ 2012లో బాల్ ఠాక్రే సీనియర్ మరణానికి ముందు కొన్నేళ్ల పాటు అంకిత భావంతో పని చేశాడు. ఏ పని చెప్పినా అందుకు ఓకే చెప్పాడు. సుదీర్గ కాలం పాటు బాల్ ఠాక్రే(Bal Thackeray) కుటుంబంలో ఒకడిగా కలిసి పోయి, అత్యంత నమ్మకమైన బంటుగా పేరొందాడు చంపా సింగ్ థాపా(Champasingh Thapa).
ఉన్నట్టుండి ఇవాళ తాను సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నాడు. శివసేన పార్టీలో తిరుగుబాటు జెండా ఎగుర వేసిన సీఎం ఏక్ నాథ్ షిండే క్యాంపు లోకి జంప్ అయ్యాడు. శివసేన మాజీ చీఫ్ బాల్ ఠాక్రే నివాసం మాతోశ్రీలో దాదాపు మూడు దశాబ్దాల పాటు సేవలందించాడు చంపా సింగ్ థాపా.
శివసేన పితామహుడికి విశ్వసనీయ సహాయకుడిగా పేరొందాడు థాపా. ఎంతగా అంటే సీనియర్ ఠాక్రే అంత్యక్రియలు నిర్వహించే సమయంలో థాపాను తన పక్కనే ఉంచు కోవడం ద్వారా సేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) అతని సేవను గుర్తించాడు. ఠాక్రే కుటుంబానికి సంబంధించి ఎవరి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా ముందుగా రిసీవ్ చేసుకునేవాడు చంపా సింగ్ థాపా.
Also Read : తప్పైంది మేడం మన్నించండి – గెహ్లాట్