Astra AI: ఫేక్ ప్రచారంపై పోరుకు ‘అస్త్ర ఏఐ’

ఫేక్ ప్రచారంపై పోరుకు ‘అస్త్ర ఏఐ’

Astra AI : సోషల్‌ మీడియాలో అసాంఘిక, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కట్టడి చేయడం సవాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి వాటిని గుర్తించేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు తమవంతు కృషిచేస్తున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ సాయంతో ప్రత్యేకంగా ‘అస్త్ర ఏఐ’ (Astra AI) అనే అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు.

Astra AI Read

ఇన్‌స్టా రీల్స్‌ లేదా యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో హానికరమైన మెసేజ్‌లు, ఫైళ్లతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే గుర్తించి.. మూడు వర్గాలుగా వర్గీకరిస్తుంది. తక్కువ తీవ్రత ఉన్న వాటిని మినహా తీవ్రత ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి సైబర్‌ సెల్‌కు పంపిస్తుంది. భద్రతా సంస్థలు నిర్ధరించుకున్న వెంటనే ఆ సమాచారాన్ని తొలగించవచ్చని రూపకర్తలు వెల్లడించారు.

సోషల్‌ మీడియాలో భారీ స్థాయిలో ఉండే కంటెంట్‌ను ప్రతిక్షణం పర్యవేక్షించడం, విశ్లేషించడం భౌతికంగా సాధ్యం కాదని, కానీ, ఏఐ టూల్‌తో సాధ్యమవుతుందని అస్త్ర ఏఐ రూపకర్తలు చెబుతున్నారు. ఇంటర్నెట్‌ బాట్‌ తరహా ప్రోగ్రాములను, వాటి మూలాలను గుర్తించడంలోనూ ఈ సాంకేతికత దోహదపడుతుందన్నారు. ఇటీవల జబల్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తమ యాప్‌ గురించి పోలీసు అధికారులకు వివరించామన్నారు. ఒకవేళ దీన్ని సోషల్‌ మీడియా వేదికలతో అనుసంధానిస్తే అసత్య సమాచార కట్టడిలో కీలకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్

Leave A Reply

Your Email Id will not be published!