Atiq Ahmed : ఆతిక్ కు ఐఎస్ఐ..లష్కర్ తో సంబంధాలు
యూపీ పోలీసుల ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు
Atiq Ahmed : యూపీకి చెందిన మాజీ ఎంపీ, గ్యాంగ్ స్టర్ ఆతిక్ అహ్మద్ పై యూపీ పోలీసులు సంచలన విషయాలు బయట పెట్టారు. ఆతిక్ అహ్మద్ కు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీస్ ఛార్జిషీట్ లో వెల్లడించారు. ఉమేష్ పాల్ హత్య కేసులో ఆతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రఫ్ లను ప్రయాగ్ రాజ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం నాలుగు రోజుల కస్టడీకి పంపింది.
గ్యాంగ్ స్టర్ గా మారిన రాజకీయ నాయకుడు ఆతిక్ అహ్మద్(Athiq Ahmed) యూపీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) , ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పడం కలకలం రేపింది.
ఐఎస్ఐ, లష్కరే తోయిబాతో నాకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నందు వల్ల నాకు ఆయుధాల కొరత లేదు. పాకిస్తాన్ నుండి ఆయుధాలను డ్రోన్ల సాయంతో పంజాబ్ సరిహద్దులో పడవేస్తారు. స్థానిక కనెక్షన్ వాటిని సేకరిస్తుంది. జమ్మూలో ఉగ్రవాదులు, కాశ్మీర్ కు ఈ సరుకు నుండి ఆయుధాలు లభిస్తాయని చెప్పాడు ఆతిక్ అహ్మద్.
ఇదిలా ఉండగా ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ గా ఉన్న ఆతిక్ అహ్మద్ కుమారుడు అసద్ , అతడి సహాయకుడు గులాం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ గురువారం ఝాన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.
ఇదిలా ఉండగా, ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ గా ఉన్న అతిక్ అహ్మద్(Athiq Ahmed) కుమారుడు అసద్ మరియు అతని సహాయకుడు గులాం, ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) గురువారం ఝాన్సీలో జరిపిన ఎన్కౌంటర్లో హతమయ్యారు.
Also Read : అసద్ ది బూటకపు ఎన్కౌంటర్