Atishi Marlena: పరువునష్టం కేసులో ఆప్ నేత ఆతిశీకి సమన్లు !
పరువునష్టం కేసులో ఆప్ నేత ఆతిశీకి సమన్లు !
Atishi Marlena: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. బీజేపీ మీడియా హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో భాగంగా ఈ సమన్లు ఇచ్చింది. జూన్ 29న కోర్టు ముందు హాజరుకావాలని ఆమెను కోర్టు ఆదేశించింది.
Atishi Marlena…
బీజేపీ, ఆప్ నాయకులకు డబ్బు ఎరవేసి వారిని కొనడానికి ప్రయత్నించిందని ఆతిశీ(Atishi Marlena) ఆరోపించడంతో ప్రవీణ్ శంకర్ ఏప్రిల్ 30న కోర్టులో ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరునూ చేర్చారు. దరఖాస్తులో ముఖ్యమంత్రి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ను ఉదహరించారు. దీనిలో తమ ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు సంప్రదించారని, పార్టీ మారితే రూ. 25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఆప్ చేస్తున్న ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ప్రవీణ్‌శంకర్ పేర్కొన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బీజేపీకు క్షమాపణలు చెప్పాలని తన పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆతిశీని నిందితురాలిగా గుర్తించి జూన్ 29న హాజరుకావాలని ఆదేశించింది.
ఆమ్‌ఆద్మీ పార్టీని అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ మంత్రి ఆతిశీ గతంలో ఆరోపించారు. నెల రోజుల వ్యవధిలో బీజేపీలో చేరాలని… లేదంటే ఈడీ చేతిలో అరెస్టయ్యేందుకు సిద్ధంగా ఉండాలని తన సన్నిహితుడి ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని అన్నారు. ఆప్ లోని మరికొందరు నేతలను సైతం కొనడానికి బీజేపీ ప్రయత్నించిందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినట్లే తనను, సౌరభ్ భరద్వాజ్, దుర్గేశ్ పాథక్, రాఘవ్ చద్దాలను అరెస్టు చేయించడానికి కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు.
Also Read : CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్‌రెడ్డి ఆశక్తికర వ్యాఖ్యలు !