ATM Charges Hike : ఏటీఎంలో మ‌నీ డ్రాపై ఛార్జీల మోత

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే

ATM Charges Hike : కేంద్ర ప్ర‌భుత్వ నిర్వాకం కార‌ణంగా త్వ‌ర‌లోనే బ్యాంకుల‌ను కూడా ప్రైవేట్ ప‌రం చేసే ప‌నిలో ప‌డ్డది. ఇక రాను రాను బ్యాంకులు ఖాతాదారుల‌కు సేవ‌ల నుండి త‌ప్పుకోనున్నాయి.

గంప గుత్త‌గా ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అమ్మ‌కానికి పెట్టిన కేంద్రం ప్ర‌భుత్వ బ్యాంకుల‌ను కూడా ప్రైవేట్ శ‌క్తుల చేతుల్లో పెట్ట‌నుంది. ఇక నియంత్రించాల్సిన ఆర్బీఐ చేతులెత్తేసింది.

ఇప్ప‌టికే స‌ర్వీస్ ల పేరుతో ఛార్జీల మోత మోగిస్తున్న ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎంల ద్వారా మ‌నీ డ్రా(ATM Charges Hike)  చేసుకుంటే అద‌న‌పు ఛార్జీలు వ‌సూలు చేయ‌నున్నాయి.

ఈ మేర‌కు ఆర్బీఐ ధ‌రా భారం మోపేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఏటీఎం న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ ప‌రిమితి , ప్ర‌ధాన బ్యాంకులు విధించే ఛార్జీలు ఈ ఏడాది 2022 జ‌న‌వ‌రి 1 నుండి అమ‌లులోకి తీసుకు వ‌చ్చాయి.

ఇక నెల వారీ ఉచిత ప‌రిమితికి మించి ఏటీఎంలో ఒక‌వేళ ఎమ‌ర్జెన్సీ నిమిత్తం డ‌బ్బులు తీస్తే ప్ర‌తి అద‌న‌పు లావాదేవీకి రూ. 21 రూపాయ‌లు విధించాల‌న్న బ్యాంకుల నిర్ణ‌యానికి ఆర్బీఐ ఓకే చెప్పింది.

ఏటీఎం లావాదేవీ ప‌రిమితి, ఛార్జీల‌ను స‌వ‌రిస్తూ ప్ర‌క‌ట‌న చేశాయి దేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ , హెచ్ డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు.

ఇదిలా ఉండ‌గా ఆర్థిక‌, ఆర్థికేత‌ర సేవ‌ల‌తో కూడిన ఉచిత లావాదేవీల‌కు మించి రుణ‌దాత‌లు వ‌ర్తించే ప‌న్నుల‌తో ఛార్జీని విధించ‌నున్నాయి బ్యాంకులు.

ఖాతాదారులు ప్ర‌తి నెలా వారి బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంల‌లో ఐదు సార్లు డ్రా చేసుకోవ‌చ్చు. వాటి ప‌రిమితి పూర్త‌య్యాక జ‌రిపే ప్ర‌తి లావాదేవీల‌పై ఛార్జీలు విధిస్తారు.

Also Read : గుడ్ ఫెలోస్ కు ర‌తన్ టాటా భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!