Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద ఐరన్ రాడ్డుతో విరుచుకుపడిన అగంతకుడు

స్వర్ణ దేవాలయం వద్ద ఐరన్ రాడ్డుతో విరుచుకుపడిన అగంతకుడు

Golden Temple : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ప్రసిద్ధ స్వర్ణ దేవాలయం(Golden Temple) వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్‌చల్‌ సృష్టించారు. ఆలయ కాంప్లెక్స్‌లో హర్యానాకు చెందిన ఒక వ్యక్తి శిరోమణి గురద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్‌పీజీసీ) సిబ్బందిపై రాడ్‌తో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. స్వర్ణదేవాలయంలోని కిచెన్ కమ్యూనిటీ సమీపంలోని చారిత్రక గురురామ్ దాస్ సెరాయ్ వద్ద ఈ ఘటన జరిగింది.

Attack in front of Golden Temple

ఎస్‌పీజీసీ వర్గాల సమాచారం ప్రకారం, ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆవరణలో తిరిగుతుండగా సిబ్బంది అతనిని ప్రశ్నించి ఐడెంటిటీ చూపించాలని కోరారు. వారితో వాదనకు దిగిన ఆ యువకుడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికే ఒక ఇనుపకడ్డీతో తిరిగి వచ్చిన అతను అక్కడి సిబ్బందిపైన, పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన వారిపైన దాడికి దిగాడు. దీనితో సిబ్బంది ఒక్కసారిగా అతనిపై పడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని హర్యానాకు చెందిన జుల్ఫన్ అనే వ్యక్తిగా గుర్తించిట్టు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఏ సర్మెల్ సింగ్ తెలిపారు. దాడికి దిగడానికి కారణంపై విచారణ జరుగుతున్నామని తెలిపారు.

గాయపడిన వారిలో బటింటాకు చెంది సిక్కు యువకుడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, శ్రీ గురు దాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. పట్టుబడిన జుల్ఫన్‌తో పాటు వచ్చి ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన మరో యువకుడిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని ఐసీయూలో చేర్చామని, తక్కిన వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ జస్మీత్ సింగ్ తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తికి మతిస్థిమితం లేదని ప్రాథమికంగా అధికారులు అనుమానిస్తున్నారు. ఎస్‌జీపీసీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా కేసు విచారణ జరుపుతున్నారు.

Also Read : India: ట్రైన్ హైజాక్‌ పై పాక్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్

Leave A Reply

Your Email Id will not be published!