Aung San Suu Kyi : ఆంగ్ సాన్ సూకీకి మ‌ళ్లీ జైలు శిక్ష

ఆస్ట్రేలియ‌న్ ఆర్థిక‌వేత్త‌కు కూడా

Aung San Suu Kyi : మిల‌ట‌రీ పాల‌న‌లో ఉన్న మ‌య‌న్మార్ లోని కోర్టు గురువారం కీల‌క తీర్పు చెప్పింది. మ‌రో క్రిమిన‌ల్ కేసులో మాజీ దేశాధ్య‌క్షురాలు ఆంగ్ సాన్ సూకీని దోషిగా నిర్దారించింది. మ‌య‌న్మార్ అధికారిక ర‌హ‌స్యాల చ‌ట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆస్ట్రేలియా ఆర్థిక వేత్త సీన్ ట‌ర్నెల్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించిన‌ట్లు న్యాయ అధికారి తెలిపారు.

సీక్రెట్స్ చ‌ట్టం ప్ర‌కారం ట‌ర్నెల్ తో విచార‌ణ జ‌రిపి దోషిగా నిర్ధారించిన త‌ర్వాత ఆంగ్ సాన్ సూకీకి(Aung San Suu Kyi) మూడేళ్ల జైలు శిక్ష విధించ‌బ‌డింది. కేసు గురించి స‌మాచారాన్ని విడుద‌ల చేసేందుకు ముందుకు రాలేదు. అంతే కాకుండా ఆంగ్ సాన్ సూకీ కేబినెట్ లోని ముగ్గురు స‌భ్యుల‌ను కూడా దోషిగా తేల్చింది. ఒక్కొక్క‌రికి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు.

ఇదిలా ఉండ‌గా సిడ్నీ లోని మాక్వేరీ విశ్వ విద్యాల‌యంలో ఆర్థిక శాస్త్రంలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ అయిన ట‌ర్నెల్ ఫిబ్ర‌వ‌రి 1, 2021 న సైన్యం చేత ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వాన్ని తొల‌గించిన‌ప్పుడు రాజ‌ధాని నేపిటావ్ లో నిర్బంధించిన ఆంగ్ సాన్ సూకీకి స‌ల‌హాదారుగా ప‌ని చేశారు.

దాదాపు 20 నెల‌ల పాటు నిర్బంధంలో ఉన్నాడు. యాంగోన్ లోని ఒక హోట‌ల్ లో ఉండ‌గా అదుపులోకి తీసుకున్నారు. మ‌య‌న్మార్ డెవ‌ప‌ల్ మెంట్ ఇన్ స్టిట్యూట్ డైరెక్ట‌ర్ గా నైపిటాపిలో కొన్నేళ్ల పాటు నివ‌సించాడు.

Also Read : హిజాబ్ వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!