Rohit Sharma : రోహిత్ శర్మకు అగ్ని పరీక్ష
సీరియస్ యాక్షన్ కు రెడీ
Rohit Sharma : సారథ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు, వన్డే సీరీస్ జరగనుంది. ఇందులో భాగంగా ఆసిస్ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది టీమిండియా. భారత జట్టులో ఇప్పటి వరకు కీలకమైన ఆటగాళ్లందరి భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది.
అనూహ్యంగా విరాట్ కోహ్లీ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన రోహిత్ శర్మ(Rohit Sharma) ఆశించిన మేర రాణించలేక పోయాడు. అంతే కాదు ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా కూడా వంద శాతం పర్ ఫార్మెన్స్ కనిపించ లేదు.
ప్రస్తుతం టీమిండియాలో కొనసాగుతున్న పలువురి ఆటగాళ్లతో పాటు కెప్టెన్ హిట్ మ్యాన్ కూడా అగ్ని పరీక్షను ఎదుర్కోనున్నాడు. రాణించక పోయినా లేదా భారత జట్టు గెలవక పోతే ఇక నాయకత్వం నుంచి తప్పించేందుకు రెడీగా ఉంది బీసీసీఐ.
ఇదే విషయాన్ని క్రికెట్ బోర్డుకు చెందిన అధికారి ఒకరు దీనిని ప్రస్తావించడం విశేషం. గతంలో టీం సెలెక్షన్ కమిటీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు అత్యంత బలంగా ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే తప్పనిసరిగా టెస్టుల్లో గెలవాల్సిన పరిస్థితి భారత జట్టుపై ఉంది.
మరో వైపు ఆసిస్ జట్టు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ సారథ్యంలో ఆసియా కప్ , ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఆడింది. కానీ కప్ లు గెలవలేక పోయింది. రోహిత్ శర్మ కు బదులు ఎవరైనా కెప్టెన్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.
Also Read : ఆడితే ఓకే లేదంటే వేటే